ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కావలి గ్రీష్మ.. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. దీంతో.. ఏపీ మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు గ్రీష్మ..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపే (మార్చి 10వ తేదీ) నామినేషన్లకు ఆఖరి రోజు. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవ్వగా.. జనసేన, బీజేపీకి ఒక్కో సీటు ఇచ్చింది. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన స్థానాలకు ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. 8,9 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో అవకాశం లేదు.