Kasibugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు అసలు కారణాలు.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు.. ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం అని స్పష్టం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదన్న మంత్రి… ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు.. హరిముకుంద్‌పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో.. తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయం అది అన్నారు.. ఇక, ఈ దేవాలయ సామర్థ్యం 2,000 నుంచి 3,000 మంది వరకు మాత్రమే ఉండగా.. ఈరోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు ప్రజలు వచ్చారు.. కానీ, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయారని వివరించారు.. మరోవైపు, ప్రభుత్వానికి కూడా సదరు వ్యక్తి సమాచారం ఇవ్వలేదు.. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం.. అందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు.. జరిగిన దుర్ఘటనకు ఇదే కారణం. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి..