AP Liquor Shops Tenders: మద్యం షాపుల దరఖాస్తులకు నేడే లాస్ట్.. ఎక్సైజ్ శాఖ కీలక సూచనలు
- నేటితో ముగియనున్న మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ..
- రాత్రి 7 గంటల వరకే అవకాశం..
- కీలక సూచనలు చేసిన ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops Tenders: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపులను మూసివేస్తూ.. కొత్త పాలసీ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 3396 ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.. అందులో భాగంగా మద్యం షాపుల టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. వరుస సెలవుల నేపథ్యంలో.. మధ్యలో ఓసారి గడువు పొడిగించారు.. అయితే, ఇవాళ రాత్రి ఏడు గంటలతో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపులకు వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి.. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం 65,424 దరఖాస్తు చేసుకున్నారు.. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1308 కోట్ల మేర ఆదాయం వచ్చింది..
Read Also: IND vs BAN: హైదరాబాద్ టీ20లో భారీ మార్పులు.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ఇక, ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా మద్యం షాపుల దరఖాస్తులు వచ్చాయి.. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం షాపుల కోసం 48,39 దరఖాస్తుల దాఖలు కాగా.. అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 40 మద్యం దుకాణాలకు కేవలం 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.. ఇవాళ రాత్రి వరకు గడువు ఉండడం వల్ల మరిన్ని దరఖాస్తులు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఈ నేపథ్యంలో.. కీలక సూచలను చేశారు ఏపీ అబ్కారీ శాఖ కమిషనర్
నిషాంత్ కుమార్.. మద్యం షాపుల దరఖాస్తులకు నేడు తుది గడువు అని స్పష్టం చేసిన ఆయన.. సాయంత్రం 7 గంటల వరకు ఆన్‌లైన్‌లో కూడా రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందన్నారు.. రిజిస్ట్రేషన్ తదుపరి రాత్రి 12 గంటలలోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లింపు చేసుకోవచ్చు అన్నారు.. ఇక, బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేవారు సాయంత్రం 7 గంటలలోపు క్యూ లైన్ లో ఉంటేనే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు.. సంబంధిత పత్రాలతో సాయంత్రం 7 గంటల్లోపు SHOల్లో అందుబాటులో ఉన్నవారికి టోకెన్లు అందించి క్రమ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ చేస్తాం న్నారు.. దరఖాస్తు దారులు నిబంధనలు పాటించి సజావుగా కార్యక్రమం ముగిసేలా సహకరించాలని కోరారు ఏపీ ఎక్సైజ్ వాఖ కమిషనర్ నిషాంత్ కుమార్..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!