ఇవాళ రాత్రి ఏడు గంటలతో మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.. రాష్ట్రంలోని 3,396 మద్యం షాపులకు వెల్లువలా దరఖాస్తులు వచ్చాయి.. ఇప్పటి వరకు మద్యం షాపుల కోసం 65,424 దరఖాస్తు చేసుకున్నారు.. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.1308 కోట్ల మేర ఆదాయం వచ్చింది..
మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించింది ప్రభుత్వం.. మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తుండగా.. వారికి శుభావర్త చెబుతూ గడువు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది..