Vamsi, Varma, Posani Cases: వంశీ, వర్మ, పోసాని కేసుల్లో కీలక పరిణామాలు..
- వైసీపీ నేతలు, సినీ నటుల కేసుల్లో కీలక పరిణామాలు..
- వంశీ బెయిల్ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ..
- రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vamsi, Varma, Posani Cases: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. మరోవైపు సినీ నటుల కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. పోలీసు కస్టడీలో విచారించిన సమయంలో కీలక సమాచారం తెలిసిందని చెప్పారు. వంశీ ఆదేశాలతోనే సత్యవర్ధన్‌ను కలిసినట్లు మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారని కోర్టుకు పీపీ తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. మరింత సమాచారం రాబట్టేందుకు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసినట్లు కోర్టుకు వివరించారు. సత్యవర్ధన్ కిడ్నాప్‌నకు, వంశీకి ఎలాంటి సంబంధం లేదన్నారు వంశీ లాయరర్లు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.
Read Also: Voyager: భూమి నుంచి 20 బిలియన్ కి.మీ దూరంలో వయోజర్.. నాసా కీలక నిర్ణయం..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక, దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సీఐడీ నమోదు చేసిన కేసును సవాలు చేస్తూ… హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషన్‌పై ఆరు వారాలు స్టే విధించింది. గతంలో విడుదలైన సినిమాకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదు చేయడమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. సినిమా రిలీజ్ అయిన సమయంలో… తెలియదా అని నిలదీశారు. అనంతరం కేసు విచారణపై ఆరువారాలస్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ 17కు తదుపరి విచారణ వాయిదా వేశారు.
Read Also: YS Jagan: ఎక్కడా రాజీ పడొద్దు.. పార్లమెంట్‌లో గట్టిగా గళమెత్తండి.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
మరోవైపు మాజీ ఎంపీ గోరంగ్ల మాధవ్.. విజయవాడ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా అత్యాచార బాధితుల వివరాలు వెల్లడించారంటూ గతేడాది నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గోరంట్ల మాధవ్‌ను…బెజవాడ పోలీసులు విచారించారు. అటు కర్నూలు జిల్లాలో పోసాని కృష్ణ బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేశారు. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. పోసానిని మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో…పోసాని లాయర్లు వ్యతిరేకించారు. కస్టడీకి ఇచ్చినా…ఉన్నతాధికారుల సమక్షంలోనే విచారించాలని కోరారు.
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!