Deputy CM Pawan Kalyan: పెద్దిరెడ్డి భూముల వ్యవహారం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూముల వ్యవహారంపై స్పందించిన పవన్..
- సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్ కల్యాణ్..
- పెద్దిరెడ్డి ఫ్యామిలీ భూములను ఆక్రమణలపై నివేదిక వచ్చింది..
- ఆ భూములను రక్షించలేని వారిని బాధ్యులను చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూముల వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూములను ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో సంబంధిత శాఖల భూములు అక్రమణలకు గురవుతుంటే రక్షించలేని వారిని బాధ్యులను చేయాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసిందని గుర్తు చేశారు పవన్ కల్యాణ్..
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
పెద్దిరెడ్డి భూముల వ్యహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ నివేదికను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు.. అటవీ భూముల అక్రమణలకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్.. అటవీ భూములను సంరక్షించలేకపోయిన అధికారులను గుర్తించి నివేదిక రూపొందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. అదే విధంగా భూములు ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులతోపాటు, అటవీ పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!