Gaza- Israel War: గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 17 మంది పాలస్తీనియన్ల మృతి..
- గాజాపై దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయెల్..
- నుసీరత్ శిబిరంపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్..
- దాడుల్లో 17 మంది చెందగా.. మరో 42 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza- Israel War: హమాస్ అధినేత యాహ్య సిన్వర్ మరణించిన గాజాపై ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తుంది. గురువారం సెంట్రల్ గాజాలోని నుసీరత్ శిబిరంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మంది తీవ్రంగా గాయాలు అయ్యాయి. మృతుల్లో 13 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఐడీఎఫ్ మాత్రం తాము హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా దాడిలు చేశామని వెల్లడించింది. కాల్పుల విరమణ చర్చలు త్వరలోనే స్టార్ట్ అవుతాయని పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఖతార్‌లో ఉన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చారు. హమాస్ చర్చలకు సిద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని మేం ఇంకా ధ్రువీకరించుకోవాల్సి ఉందన్నారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్లకు 135 మిలియన్ డాలర్ల సాయాన్ని ఈ సందర్భంగా బ్లింకెన్ ప్రకటించారు.
Read Also: Bomb Threat: టెంపుల్ సిటీలో కలకలం.. హోటళ్లకు బాంబు బెదిరింపులు..
Also Read
అయితే, గాజా యుద్ధ వార్తలను అందిస్తున్న ఆరుగురు అల్ జజీరా సంస్థ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా ఐడీఎఫ్ ప్రకటించింది. తాము గాజాలో కనుగొన్న పత్రాలు, నిఘా వర్గాల సమాచారంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. ఇందులో ఇద్దరికి హమాస్‌తో, నలుగురికి పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌తో సంబంధం ఉందన్నారు. ఈ ఆరోపణలపై అల్ జజీరా తీవ్రంగా మండిపడింది. వాస్తవాలను తెలియజేస్తున్న పాత్రికేయుల నోళ్ల మూయించడానికి ఇజ్రాయెల్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శలు గుప్పించింది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!