Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. వారిపై యాక్షన్ తప్పదు..!
- కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..
- ప్రైవేట్ ఆలయ నిర్వాహకులపై ఆగ్రహం..
- అమాయకుల ప్రాణాలు పోయాయి.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రైవేట్ ఆలయ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమాయకుల ప్రాణాలు పోయాయి.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూనే, భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.. కాశీబుగ్గలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం… ప్రాణం చాలా విలువైనది. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. బాధ్యులైన వారిపై చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు.
Read Also: Pakistan: పాక్‌లో “గుర్తుతెలియని వ్యక్తుల” హల్చల్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖతం..
Also Read
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్‌గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్‌తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
ఇక, ప్రైవేట్ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించి, నిర్వహిస్తున్న దేవాలయం.. ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం దురదృష్టకరం అన్నారు.. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. కానీ, ఆలయ నిర్వాహకులు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. పోలీస్ బందోబస్తు కూడా లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత దారుణం అన్నారు.. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని.. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను, ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.. గాయపడినవారికి మెరుగైన సత్వర చికిత్స అందించాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నిండు ప్రాణాలు పోయాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాలు, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారించి భద్రతా నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!