మెగా డీఎస్సీకి సంబంధించిన కీలక సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు మెగా డీఎస్సీ 2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి.. పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు చేపడతామని స్పష్టం చేసిన ఆయన.. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వం దృఢ సంకల్పం అన్నారు..
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. మెగా డీఎస్సీ పరీక్షల నిలుపుదలకు ‘నో’ చెప్పిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మెగా డీఎస్సీ నిర్వహించకుండా ‘స్టే’ కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు..
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనికోసం మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది.. ఆ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది.. కాగా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది..
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు శుభావార్త చెబుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు.. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు పోస్టింగుల్లో ఉండాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం 2025-26 బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై సభలో చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల నేపథ్యంలో స్కూళ్లలో ప్రహారీ నిర్మాణం, డీఎస్సీపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి రూ.3వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. అన్ని కాలేజీలు, స్కూళ్లలో ‘ఈగల్’…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధం మయ్యేందుకు వీలుకల్పిస్తూ మెగా డీఎస్సీ సిలబస్ 27-11-2024 ఉదయం 11 గంటల నుంచి ఏపీడీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వి. విజయ్ రామరాజు ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగులకు శాసన సభ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. త్వరలోనే 16 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.