CM Chandrababu in London: ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. లండన్ లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్ల్డ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు.. లండన్ లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఉంది.. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని ఆహ్వానించారు.. అమరావతి, విశాఖలలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు.. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఏపీలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు స్పష్టం చేశారు.. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని తెలిపారు.. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు వివరించారు ముఖ్యమంత్రి. ఈ రంగంలో ఏపీ నిర్దేశించుకున్న మన లక్ష్యాలను వివరించి.. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు నాయుడు..
Read Also: Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్‌లో 22 వికెట్లు తీసిన డీఎస్పీ.. ఆమె ఎవరో తెలుసా?
లండన్‌లో హిందుజా గ్రూప్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.. విశాఖలోని హిందుజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600 మెగావాట్లు పెంచేందుకు ఒప్పందం కుదిరింది.. ఇక, రాయలసీమలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు హిందుజా గ్రూప్ ఒప్పందం చేసుకుంది.. మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్‌కు ఒప్పందం జరిగింది.. ఏపీవ్యాప్తంగా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదురింది.. గ్రీన్ ట్రాన్స్‌పోర్టు ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసేలా హిందుజా గ్రూప్ ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు..