Site icon NTV Telugu

Thalliki Vandanam Scheme: మరో ముఖ్యమైన హామీ అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్.. రేపే ఖాతాల్లో నిధులు జమ..!

Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme

Thalliki Vandanam Scheme: సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. సీఎం చంద్రబాబు.. తల్లికి వందనంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు వారి ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Read Also: APRERA: రెరాలో రిజిస్టర్ కాని ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయొద్దు..

ఓ కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది సర్కార్.. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింప జేయనున్నారు.. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తారు.. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.. విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కాగా, సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తల్లికి వందనం అమలుపై నిర్ణయం తీసుకుంది..

Read Also: Mangli Party Issue: మంగ్లీ కేసు FIR కాపీ.. కీలక విషయాలు వెలుగులోకి!!

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపు జేయనుండగా.. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం..

Exit mobile version