మంగ్లీ FIR కాపీలో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు.. రాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో రిసార్ట్ పై ఫిర్యాదు వచ్చింది, రిసార్ట్లో పెద్ద పెద్ద సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారని, రిసార్ట్లో పెద్ద ఎత్తున డీజే పెట్టారంటూ కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో త్రిపుర రిసార్ట్ కి వెళ్ళిన మహిళా ఎస్సై పదిమంది మహిళలు 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. అందరూ కూడా మద్యం మత్తులో ఉండి డాన్సులు చేస్తున్నట్లు గుర్తించారు.
Also Read:Divi: నేనే తప్పూ చేయలేదు.. దయచేసి నా ఫోటోలు వాడకండి.. దివి విజ్ఞప్తి!
సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతున్నట్లు, బర్త్డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని అక్కడ ఉన్న మేనేజర్ చెప్పాడు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా లేదని గుర్తించారు. వెంటనే బర్త్డే పార్టీ చేసుకుంటున్న మంగ్లీని విచారించారు. ఆమె బర్త్డే పార్టీ అనుమతి లిక్కర్ అనుమతి డీజే అనుమతి లేదని చెప్పారు. డీజేను ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్ చేస్తున్నట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న పురుషులు, మహిళలు అందరికీ డ్రగ్ కిట్టు ద్వారా డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఒక్కరు గంజాయి తీసుకున్నట్లు తేలింది.
Also Read:Pakistan: “సిందూర్” దాడుల్ని పరదాలతో కప్పుతున్న పాకిస్తాన్..
మంగ్లీ అనుచరుడుగా ఉన్న దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు గుర్తించారు. దామోదర్ రెడ్డిని అరెస్టు చేసి విచారించి పంపాం కానీ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని గుర్తించామని పోలీసులు ఎఫైర్ కాపీలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ,మంగ్లీల పై కేసు నమోదు చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్, ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్ పైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం అని అందులో పేర్కొన్నారు.