Thalliki Vandanam Scheme: మరో ముఖ్యమైన హామీ అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్.. రేపే ఖాతాల్లో నిధులు జమ..!
- సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్..
- కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది..
- రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనున్న కూటమి ప్రభుత్వం..
- తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalliki Vandanam Scheme: సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. సీఎం చంద్రబాబు.. తల్లికి వందనంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు వారి ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం.
Read Also: APRERA: రెరాలో రిజిస్టర్ కాని ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయొద్దు..
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ఓ కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది సర్కార్.. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింప జేయనున్నారు.. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తారు.. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.. విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. కాగా, సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తల్లికి వందనం అమలుపై నిర్ణయం తీసుకుంది..
Read Also: Mangli Party Issue: మంగ్లీ కేసు FIR కాపీ.. కీలక విషయాలు వెలుగులోకి!!
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపు జేయనుండగా.. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం..
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..