తల్లికి వందనం పథకంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీలో తల్లికి వందనం పథకం పెండింగ్ దరఖాస్తులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.. విద్యా శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన లోకేష్.. పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.. దీంతో, త్వరలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ము జమకానుంది.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో అక్కాచెల్లెళ్ల వినూత్న ఆలోచనతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందన పథకం అమ్మ నుంచి పథకం ద్వారా వచ్చే డబ్బులు మా నాన్నకు ఇవ్వండి అంటూ అక్కాచెల్లెళ్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఐదేళ్లుగా నాన్న వద్ద ఉంటున్నామని.. తల్లి తమను వదిలి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు..
సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం ఇవ్వనుంది ప్రభుత్వం.. రేపే తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.. సీఎం చంద్రబాబు.. తల్లికి వందనంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు వారి ఖాతాల్లో జమ చేయనుంది…
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ.. అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళామణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు.. సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడుతూ ముందుకు వెళ్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తామని తెలిపారు.ఆగస్ట్ 15న ఉచిత బస్ పథకం మహిళలకు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అందరూ మనసుపెట్టి పనిచేయాలని, పొలిటికల్ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్వచ్చాంద్ర అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు. 175 నియోజక వర్గాల యాక్షన్ ప్లాన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో సీఎం…