CM Chandrababu: 3 పార్టీలు.. 3 రకాల స్వభావాలు.. కానీ ఒకటే ఆలోచన.. ఇది శాశ్వతంగా ఉండాలి..!
- మూడు పార్టీలు.. మూడు రకాల స్వభావాలు.. ఒకటే ఆలోచన..
- ఈ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష..
- ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మూడు పార్టీలు.. మూడు రకాల స్వభావాలు.. కానీ, ఒకటే ఆలోచన.. ఈ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరిలో జరిగిన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే గతం గుర్తొస్తోంది. ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులుండేవి. పవన్ ఏపీకి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే.. రోడ్డు మార్గంలో వచ్చారు. రోడ్ మార్గంలో కూడా పవన్‌ను రానివ్వలేదు. కానీ, పవన్ కల్యాణ్ రోడ్డు మీదే పడుకున్నారు. సాధారణంగా సినిమావాళ్లు ఇదంతా చేయరు.. కానీ, పవన్ పట్టుదలతో ప్రజాస్వామ్యం కోసం కష్టపడి పని చేశారని అభినందించారు చంద్రబాబు నాయుడు.. జైల్లో ఉన్న నన్ను పరామర్శించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా పొత్తు గురించి ప్రకటన చేసిన వ్యక్తి పవన్.. బీజేపీతో పొత్తులో ఉన్నా.. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బీజేపీని కూడా ఒప్పిస్తానని చెప్పారు పవన్ కల్యాణ్.. నాది, పవన్‌ది ఒకే ఆలోచన. ప్రజలు గెలవాలి.. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేయాలనేదే మా ఇద్దరి ఆలోచనగా స్పష్టం చేశారు.
Read Also: Diamond Business: వజ్రాల వ్యాపారంలో భారీ సంక్షోభం.. దేశవ్యాప్తంగా 60 మంది ఆత్మహత్య!
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
సీట్ల విషయంలో కూడా ఏ చిన్న గ్యాప్ లేకుండా పని చేశాం. పురందేశ్వరి కూడా పొత్తు గురించి కృషి చేశారన్నారు చంద్రబాబు.. వేరే వారు బీజేపీ అధ్యక్షునిగా ఉంటే ఏమయ్యేదో తెలీదు కానీ.. పురందేశ్వరి ఉన్నారు కాబట్టి పొత్తు సాధ్యమైందని పేర్కొన్నారు.. ముగ్గురు కలిసి పోటీ చేస్తే రాష్ట్రానికి పునర్ వైభవం తేవచ్చని భావించాం. పొత్తు వల్ల నష్టం వస్తుందేమోననే అనుమానాల్ని కొందరు వ్యక్తం చేశారు.. కాదు లాభమని మేం ఇద్దరం నమ్మాం.. అదే నిజమైందన్నారు.. కేంద్రం సహకరించకుంటే.. కేంద్రంలో మన అనుకున్న ప్రభుత్వం లేకుంటే ఏపీని కాపాడుకోవడం కష్టమయ్యేదన్నారు.. మేం ప్రతిపక్షంలో ఉండగా.. ఎన్నో విమర్శలు చేశాం. కానీ, అధికారంలోకి వచ్చాక చూస్తే.. గత పాలకులు ప్రభుత్వాన్ని నడిపిన తీరు చూసి చాలా ఆశ్చర్యమేస్తోంది. ఇంతటి దారుణంగా వ్యవహరిస్తారా..? అని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు..
రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా 93 శాతం స్ట్రైక్ రేట్.. 52 శాతం ఓటింగ్ ఎప్పుడూ లేదు. ఎప్పుడూ రానటువంటి విజయం 2024 ఎన్నికల్లో వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు.. మూడు పార్టీలు అనుసరించిన విధానం.. ఏ చిన్నపొరపాటు జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పనులు చేయడం ఎంత ముఖ్యమో.. ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజామోదం ఉండాలంటే వారు మెచ్చుకునేలా పని చేయాలి.. మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.. మూడు పార్టీలు.. మూడు రకాల స్వభావాలు.. కానీ ఒకటే ఆలోచనగా స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చెప్పాలి.. కేంద్ర పథకాల అనుసంధానం గురించి చెప్పాలన్నారు.. వికసిత్ భారత్, జల్ జీవన్ మిషన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాల అద్భుతంగా ఉన్నాయి. కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ఏపీలో ప్రతి ఇంటికి కుళాయి నీరందిస్తాం అన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు పక్కదారి పట్టించింది గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నిధులను ఇచ్చాం. ఒకే రోజున గ్రామసభలు పెట్టే అద్భుతమైన ఆలోచన పవన్ కల్యాణ్‌ది అన్నారు. ఇలాంటి వండర్ ఫుల్ ఆలోచన పవనుకు ఎలా వచ్చిందో అనుకున్నా. ఒకే రోజున గ్రామసభలు నిర్వహణపై గిన్నిస్ బుక్ రికార్డు నమోదు అయిందన్నారు..
ఏపీలో పెద్ద ఎత్తున రైల్వే లైన్లు వేస్తున్నారు అని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. విశాఖ రైల్వే జోన్ కోసం గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా అడ్డం పడిందని విమర్శించారు.. త్వరలోనే విశాఖ రైల్వేై జోన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామని కేంద్రం ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీలో ఇండియా గేమ్ ఛేంజర్ కాబోతోంది. పీఎం సూర్య ఘర్ ద్వారా గ్రీన్ ఎనర్జీ రివల్యూషన్ రాబోతోంది. దీన్నో ఉద్యమ స్ఫూర్తితో చేయబోతున్నాం. ఒకప్పుడు ఇళ్లకు.. పంటలకు కరెంట్ లేని పరిస్థితి.. కానీ, ఇప్పుడు ఇళ్ల మీద కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ 72 గిగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. కేంద్రంలోని కార్యక్రమాలను అధ్యయనం చేసుకోవడం.. వాటిని అనుసంధానం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!