తెలంగాణ అభివృద్ధికి నేను తెచ్చిన ఐటీ విప్లవమే కారణం అని గుర్తు చేశారు. హైటెక్ సిటీ ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించాం.. ఐటీ రంగంలో తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ముందున్నారు అని పేర్కొన్నారు. సింగపూర్ ప్రజల ఉత్సాహం ఏపీ అభివృద్ధికి దోహదం కావాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.
CM Chandrababu: ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20, 494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
Minister Narayana: అమరావతిలో మొదటి దశలో రైతుల దగ్గర తీసుకున్న 34 వేల ఎకరాల భూమి విలువ పెరగాలి అని మంత్రి నారాయణ తెలిపారు. కొత్త పరిశ్రమలు రావాలంటే ఎయిర్ పోర్టు ఉండాలని చెప్పుకొచ్చారు. రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.. ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది.