CM Chandrababu: రాష్ట్ర పునర్నిర్మాణమే మా లక్ష్యం.. ప్రతీ హామీ అమలుచేస్తాం
- ఏపీ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు- సీఎం చంద్రబాబు
- డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం- సీఎం
- స్వార్థ ప్రయోజనాల కోసం కలిసి పోటీ చేయలేదు- చంద్రబాబు
- రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం- ముఖ్యమంత్రి చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ జనసేన బీజేపీ కలవడం దగా పడ్డ రాష్ట్రం పునర్నిర్మాణం లక్ష్యంగా ఏర్పాటు జరిగిందని తెలిపారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, ప్రస్తుతం గత ప్రభుత్వానికి సంబంధించి సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వార్ధ ప్రయోజనాల కోసం కలిసి పోటీ చేయలేదు.. రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. గత పాలనలో ఏపీ ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి.. డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మరోవైపు.. గౌరవ సభను గౌరవించలేని సంస్కారం లేని పార్టీ వైసీపీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు.
Read Also: Fibernet: ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.. ఉత్తర్వులు జారీ
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైసీపీ దిగజారి మాట్లాడుతోంది.. 11 మంది సభ్యులు సభలో 11 నిమిషాలే ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న ఏపీని గాడిలో పెడుతున్నాం.. గత ప్రభుత్వం అసెంబ్లీని కౌరవ సభగా మార్చింది.. ప్రజామోదంతో మళ్లీ సభలో అడుగుపెట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మంచి తోడ్పాడు అందుతోందని చంద్రబాబు వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని నెరవేరుస్తున్నాం.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మరోవైపు.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నాం.. అన్న క్యాంటీన్లు మళ్లీ తెరిచి పేదల కడుపు నింపుతున్నామని అన్నారు. అంతేకాకుండా.. 16 వేల 384 పోస్టులతో త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని పేర్కొ్న్నారు. అదే విధంగా ఉద్యోగాల కల్పనపై కూడా దృష్టి పెడతామని సీఎం తెలిపారు. గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాష్ట్రం మారుతుందని.. దీంతో ఉద్యోగాల కల్పన సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నెలకు మూడు వేల ఉద్యోగ భృతి కూడా ఇస్తామన్నారు. మానవ వనరుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
Read Also: Hyperloop: “3 గంటల్లోపే హైదరాబాద్ టూ ఢిల్లీ”.. “హైపర్‌లూమ్” రవాణాకు భారత్ సిద్ధం..
ఇవాళ శాసన సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. వైసీపీ తీరు పై అసహనం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా జగన్ తీరు ఉందన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం దేనికి అని ప్రశ్నించారు. సభకు వచ్చి వైసీపీ తమ అభిప్రాయం చెప్పాలని స్పీకర్ పేర్కొన్నారు. కాగా.. సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి ప్రభుత్వ ప్రాధాన్యత వివరించారు. అనంతరం.. అసెంబ్లీ సమావేశాలు శుక్ర వారానికి వాయిదా పడ్డాయి. అదే రోజు 2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!