NTV Telugu Site icon

CM Chandrababu: ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..

Cm Chandrababu

Cm Chandrababu

ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రథాలు తగలబెట్టడం, ఆడవాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడటం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఉన్న 14 వేల సీసీ కెమెరాలు గత ప్రభుత్వం వాడలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని కూడా వాడుకోలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వీధిలైట్లు అన్ని వెలగాలి.. అధికారులు కూడా అశ్రద్ధ వీడాలి.. గత ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. తవ్విన కొద్దీ అవినీతి, అరాచకాలు బయటపడుతున్నాయన్నారు. అడవి పందులు, పంటను నాశనం చేసినట్లు, రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని మండిపడ్డారు.

Russian-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి.. 136 డ్రోన్లు ప్రయోగం

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి వాడకంతో.. తల్లికి, చెల్లికి, కూతురికి తేడా లేకుండా కొంతమంది దుర్మార్గులు ప్రవర్తిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటివి ఇక మీదట జరగకూడదని హెచ్చరించారు. రాష్ట్రంలో చెత్త పన్ను విధించి రాష్ట్రాన్ని చెత్త రాష్ట్రంగా మార్చారు.. ఆ చెత్తలో వేసి వాళ్ళని కప్పి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను రాష్ట్రంలో తీసేశాం.. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పెట్టారు.. రూ. 600 కోట్లతో గుంతలు పూడుస్తున్నామని తెలిపారు. నవంబర్ 1 నుంచి రోడ్ల గుంతలు పూడుస్తాం.. నూతన సంవత్సరానికి రాష్ట్రంలో గుంతలు లేకుండా చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

RGV: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ప్రశంసిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్

అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని.. విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.. ఇండస్ట్రియల్ హబ్‌గా అద్భుతమైన సిటీని నిర్మిస్తామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం.. ఎన్డీఏ కూటమి పాలసీ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో స్వర్ణకారుల భవిష్యత్తు కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తాం.. పరిశ్రమల ఏర్పాటులో లోకల్, నాన్ లోకల్ అనే అంశాలు చూడకూడదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు వెళ్లి అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు.. అలాగే బయట వారు కూడా వచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోవచ్చు, ఉపాధి పొందవచ్చని సీఎం పేర్కొన్నారు.