AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీల్లో రాజకీయ కసరత్తు ముమ్మరమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రేపుఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ముఖ్యంగా.. ఈ భేటీలో ‘స్థానిక ఎన్నికలలో పోటీపై ఎలా ముందుకు వెళ్లాలి, ఎవరు ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి’ అనే అంశాలపై ప్రధానంగా. చర్చ జరగనుంది. మేయర్ స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడుమాధవ్ లేదా మంత్రి సత్యకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూటమి నేతల సమావేశం హాట్ టాపిక్ గా మారింది.
మొత్తంగా.. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కూటమి తరఫున స్థానిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? అభ్యర్థుల ఎంపికను ఎలా చేపట్టాలి? అనే అంశాలపై చర్చ జరగనుంది.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మేయర్ స్థానాల విషయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఏ పార్టీకి ఏ స్థానాలు దక్కాలి అనే అంశాలపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
Also Read
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల నేతలు పలు దఫాలుగా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కూడా స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించి, అభ్యర్థుల ఎంపికలో ప్రజామోదం ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ సమన్వయ కమిటీతో సమావేశమై క్షేత్రస్థాయి బలాబలాలపై సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!