Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli – Rohit Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎప్పుడూ ప్రత్యేకమే.. అయితే, వీరి రిటైర్మెంట్పై ఎప్పటి నుంచి చర్చ జరుగుతుండగా.. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన సిరీస్‌తో సూపర్ ఫామ్ చూపించారు.. మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైంది. అయితే సిరీస్‌లో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చూపించిన ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.
తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అజేయంగా 139 పరుగులు చేయగా.. రెండో వన్డేలో రోహిత్ శర్మ 101 పరుగులతో సెంచరీ సాధించాడు. మూడో వన్డేలోనూ రోహిత్ 92 పరుగులతో రాణించాడు. దీంతో సీనియర్ ఆటగాళ్లపై ఇటీవల వచ్చిన విమర్శలకు వారి ప్రదర్శన సమాధానంగా నిలిచిందని మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన కైఫ్.. రోహిత్, విరాట్ తమపై పెట్టుకున్న అంచనాలు, విమర్శలను తప్పని నిరూపించారని పేర్కొన్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ ఇద్దరు తమ సత్తాను మరోసారి చాటుకున్నారని అన్నారు. వారి ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తిన వారికి తాజా ప్రదర్శనతో సమాధానం లభించిందని కైఫ్ వ్యాఖ్యానించారు.
Also Read
- Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ఇదే సందర్భంలో కైఫ్ మరో సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీని కూడా ప్రస్తావించారు. షమీకి తగినంతగా అవకాశాలు ఇచ్చి, అతడిపై నమ్మకం ఉంచి ఉంటే అతను కూడా ఇదే విధంగా రాణించేవాడని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం షమీ లాంటి నైపుణ్యం ఉన్న బౌలర్లు జట్టులో తక్కువగా ఉన్న సమయంలో అతడికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రోహిత్, విరాట్ విషయంలో జట్టు మేనేజ్మెంట్ అనుసరించిన ఆలోచన సరైనదైతే వారు ఇప్పటికీ జట్టులో కొనసాగేవారని కైఫ్ అన్నారు. అదే పరిస్థితి షమీకి కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే షమీని జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
వన్డే ప్రపంచకప్‌లలో షమీ గతంలో అద్భుత ప్రదర్శన చేసిన విషయాన్ని కూడా కైఫ్ ప్రస్తావించారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్ల అనుభవం, ఫామ్‌ను జట్టు మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్, విరాట్ ప్రదర్శనతో పాటు షమీపై కైఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మొత్తంగా.. తమ ఫామ్‌పై విమర్శలు వచ్చినప్పుడల్లా.. ఇలా బ్యాట్‌తో సమాధానం చెప్పడం రోహిత్‌కు, కింగ్ కోహ్లీకి కొత్తమేకాదు..
తాజావార్తలు
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!