CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Delhi Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన బాటకు సిద్ధమయ్యారు.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవున్నట్టుగా తెలుస్తోంది.. రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎల్లుండి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా చంద్రబాబు సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస ప్యాకేజీ కోసం కేంద్రం నుంచి రూ.33 వేల కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ నిర్మాణానికి అవసరమైన రూ.2,300 కోట్ల నిధులను కేంద్రం నుంచి కేటాయించాలని కూడా చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు పనులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుసంధాన మౌలిక వసతులకు సంబంధించిన నిధులపై కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది..
Also Read
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!