East Godavari: కేంద్రం గ్రీన్ సిగ్నల్.. తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు
- తీరనున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల కష్టాలు..
- కీలకమైన కెనాల్ రోడ్డును స్టేట్ హైవేగా మార్చడానికి కేంద్రం అంగీకారం..
- ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో నిధులు విడుదల..
- కాకినాడ పోర్టుకు మూడో ప్రత్యామ్నాయ లైన్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో వేమగిరి నుంచి సామర్లకోట వరకు 62 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం అంటేనే చెమటలు పడతాయి. రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాలకు వెళ్లే వారికి ఈ కెనాల్ రోడ్డే దిక్కు. ఇది పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రతిరోజు యాక్సిడెంట్లు సాధారణం అయిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలతో బయటపడ్డవారికి లెక్కలే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కీలకమైన ఈ కెనాల్ రోడ్డుకు మాత్రం మోక్షం దక్కలేదు. కాకినాడ పోర్టుకు రాష్ట్ర హైవే అనుసంధానం చేస్తే మరో ప్రత్యామ్నాయ మార్గం వస్తుంది. దానివలన రాకపోకలు కూడా సులభతరం అవుతాయి. ఈ కీలకమైన ప్రాజెక్టు దశాబ్దాలుగా కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది.
Read Also: Allu Arjun : ‘చిక్కు బాబాయ్’కి చిన్నప్పటి నుంచే ఫ్యాన్
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
తాజాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… ఈ 62 కిలోమీటర్లు కెనాల్ రోడ్డును హైవేగా మారుస్తూ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు పంపించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటికే కాకినాడ పోర్టుకి రెండు రోడ్లు ఉండగా మూడో ప్రత్యామ్నాయ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనివల్ల సామర్లకోట – రాజమండ్రి మధ్య ఉన్న టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే హైవే కి సంబంధించి భూ సేకరణ పనులు కూడా పూర్తయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లడానికి ఏడీబీ రోడ్డు ఉంది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా కెనాల్ రోడ్డు కూడా వినియోగంలో ఉంది. 2016లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలోకి రాలేదు. అంచనా వ్యయం కూడా అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. ఈ రోడ్డును ఫోర్ లైన్ రోడ్డుగా మార్చేందుకు రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లడంతో వెంటనే అనుమతులు లభించాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి యఅఇతే కాకినాడ – రాజమండ్రి మధ్య రవాణాతో పాటు ఇతర రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!