IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి‘ ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులు మరియు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రవితేజను ఒక సరికొత్త, వైవిధ్యమైన పవర్ ఫుల్ అవతార్‌లో దర్శకుడు ప్రజెంట్ చేయబోతున్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో రవితేజకు సంబంధించిన ‘అయ్యప్ప మాల’ ధరించిన లుక్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ లుక్ సినిమాపై ఒక్కసారిగా హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ వీడియో గ్లిమ్స్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ గ్లిమ్స్ సినిమా రేంజ్‌ను చూపేలా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మోస్ట్ అవేటెడ్ గ్లిమ్స్ ను ఈనెల 3వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. ఈ గ్లిమ్స్‌తో పాటే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గ్లిమ్స్‌లో మాస్ మహారాజా లుక్ మాత్రం సెన్సేషనల్ గా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. చిత్ర యూనిట్ ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా సరైన మాస్ హిట్ లేక సతమతమవుతున్న రవితేజ ఇటీవల ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో తన రూట్ మార్చారు. ఈ నేపథ్యంలో భక్తి, యాక్షన్ కలగలిపిన ఒక డిఫరెంట్ కథాంశంతో వస్తున్న ‘ఇరుముడి’ చిత్రంతో మాస్ రాజా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం గ్యారెంటీ అని అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?