Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..

  • అసెంబ్లీలో ఉన్న 95 శాతం మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు..
  • వైసీపీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు..
  • వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీయే ప్రభుత్వం చేయదన్న బీజేపీ ఎమ్మెల్యే..
Vishnu Kumar Raju

Vishnu Kumar Raju

Vishnu Kumar Raju: ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 95 శాతం మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు అని దుయ్యబట్టారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీయే ప్రభుత్వం చేయదన్న ఆయన.. అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయి అని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. దొంగ కేసులు పెట్టడం వల్ల పాస్ పోర్టు రెన్యువల్ కూడా అవ్వక చాలా మంది ఇబ్బంది పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, విశాఖను అక్రమాలకు అడ్డాగా గత ప్రభుత్వం మార్చిందని విమర్శించారు.. చంద్రబాబు విశాఖ వస్తే.. గుండాయిజం చేయించారు.. కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేయించారిన మండిపడ్డారు.

Read Also: NEET UG Revised Result: నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల

×
×
Ad

మరోవైపు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విశాఖలో జనవాణి కార్యక్రమం పెడితే అక్కడికి రాకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణుకుమార్‌ రాజు.. వైసీపీ గూండాలతో విశాఖపట్నం నిండి పోయిందని ఆరోపించిన ఆయన.. అక్రమ కేసులు, దాడులపై హోంమంత్రి అనిత సమీక్ష చేయాలని సూచించారు.. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిపై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని.. సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు.. పచ్చదనంతో నిండి ఉండే విశాఖలో జగన్ కొండల్ని, భూముల్ని కబ్జా చేశారు.. ఇంక మిగిలింది సముద్రం ఒక్కటే.. అందుకే ప్రజలు వైసీపీని చీకొట్టారు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.