Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..
- అసెంబ్లీలో ఉన్న 95 శాతం మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు..
- వైసీపీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు..
- వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీయే ప్రభుత్వం చేయదన్న బీజేపీ ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Kumar Raju: ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 95 శాతం మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారు అని దుయ్యబట్టారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీయే ప్రభుత్వం చేయదన్న ఆయన.. అధికారం ఉంది కదా అని పేట్రేగిపోయిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయి అని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తుచేశారు. దొంగ కేసులు పెట్టడం వల్ల పాస్ పోర్టు రెన్యువల్ కూడా అవ్వక చాలా మంది ఇబ్బంది పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, విశాఖను అక్రమాలకు అడ్డాగా గత ప్రభుత్వం మార్చిందని విమర్శించారు.. చంద్రబాబు విశాఖ వస్తే.. గుండాయిజం చేయించారు.. కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేయించారిన మండిపడ్డారు.
Read Also: NEET UG Revised Result: నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల
Also Read
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖలో జనవాణి కార్యక్రమం పెడితే అక్కడికి రాకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణుకుమార్ రాజు.. వైసీపీ గూండాలతో విశాఖపట్నం నిండి పోయిందని ఆరోపించిన ఆయన.. అక్రమ కేసులు, దాడులపై హోంమంత్రి అనిత సమీక్ష చేయాలని సూచించారు.. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిపై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని.. సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు.. పచ్చదనంతో నిండి ఉండే విశాఖలో జగన్ కొండల్ని, భూముల్ని కబ్జా చేశారు.. ఇంక మిగిలింది సముద్రం ఒక్కటే.. అందుకే ప్రజలు వైసీపీని చీకొట్టారు అంటూ హాట్ కామెంట్లు చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు ఎగిరి గంతేసే వార్త.. రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!