Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Damages: ఆంధ్రప్రదేశ్‌ను అర్నబ్ తుఫాన్ అతలాకుతలం చేసింది.. అర్నబ్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, మౌలిక వసతులకు నష్టం వాటిల్లిందని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తుఫాన్ కారణంగా మొత్తం 126.165 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక నష్టం
తుఫాన్ ప్రభావంతో జిల్లాల వారీగా రహదారులకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 111.665 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 14.5 కిలోమీటర్ల మేర రహదారులకు నష్టం వాటిల్లింది. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రాథమికంగా రూ.59.45 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. అయితే, దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించేందుకు తాత్కాలిక పనులకు రూ.9.18 కోట్లు, శాశ్వత పునరుద్ధరణ పనులకు రూ.50.27 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాల వారీగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో పునరుద్ధరణ పనులకు అత్యధికంగా రూ.29.42 కోట్లు అవసరమని అంచనా వేయగా, శ్రీకాకుళం జిల్లాలో రూ.24.94 కోట్లు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో రూ.4.22 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.86.30 లక్షలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనాలు వెల్లడించాయి.
Also Read
- Flights Cancelled : తుఫాన్ దెబ్బ.. విజయవాడలో ఇండిగో విమానాలన్నీ రద్దు.!
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న 'అర్నబ్'.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
- Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
- AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
9 కల్వర్టులు దెబ్బతినగా.. ఆరింటి పునరుద్ధరణ పూర్తి
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది కల్వర్టులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటిలో ఆరు కల్వర్టుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మరోవైపు రెండు చోట్ల రోడ్లపై స్కౌర్లు ఏర్పడగా, ఒకచోట పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ రహదారులు, కల్వర్టుల మరమ్మతులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై 1,058 చెట్లు నేలకొరిగాయి. వీటిలో ఇప్పటికే 859 చెట్లను అధికారులు తొలగించారు. చెట్లు, ఇతర అడ్డంకుల కారణంగా 57 చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, 20 ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. రహదారులపై పడిపోయిన చెట్లను, ఇతర అడ్డంకులను యుద్ధప్రాతిపదికన తొలగిస్తూ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఆర్అండ్బీ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో రాకపోకలను వీలైనంత వేగంగా పునరుద్ధరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, ఇతర మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఆర్ అండ్ బీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి..
తాజావార్తలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!