Flights Cancelled : తుఫాన్ దెబ్బ.. విజయవాడలో ఇండిగో విమానాలన్నీ రద్దు.!
- విజయవాడ విమానాశ్రయంలో ఇండిగో సర్వీసుల రద్దు
- ఫ్లై91, ఎయిర్ ఇండియా విమానాలపైనా తుఫాన్ ప్రభావం
- చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సర్వీసులకు అంతరాయం
- ప్రయాణానికి ముందు విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ‘అర్నబ్’ (Arnab) తీవ్ర తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇప్పటికే పలు రైళ్లు రద్దవగా, తాజాగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. తుఫాన్ ఉధృతి కారణంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఇండిగో (IndiGo) విమానాలన్నింటినీ బుధవారం (అక్టోబర్ 28) ఒక్కరోజూ పూర్తిగా రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.
విజయవాడలో ఇండిగో విమానాలు బంద్.. ఇతర సర్వీసులు కూడా రద్దు
తుఫాన్ కారణంగా అప్రమత్తమైన విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రత రీత్యా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. బుధవారం ఒక్కరోజే విజయవాడ నుంచి నడవాల్సిన ఇండిగో విమానాలన్నీ రద్దయ్యాయి. కేవలం ఇండిగో మాత్రమే కాకుండా, ఫ్లై91 (Fly91) సంస్థ కూడా తమ హైదరాబాద్ సర్వీసులను రద్దు చేసుకుంది. ఉదయం 8.30 గంటలకు నడవాల్సిన హైదరాబాద్–విజయవాడ–హైదరాబాద్ (IC 3301/IC 3302) సర్వీస్‌తో పాటు, సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరాల్సిన హైదరాబాద్–విజయవాడ–హైదరాబాద్ (IC 3305/IC 3306) విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఢిల్లీ నుంచి విజయవాడకు రావలసిన ఎయిర్ ఇండియా విమానం (AI 1724/1851) కూడా బుధవారం రద్దయిన జాబితాలో ఉంది.
Also Read
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న 'అర్నబ్'.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
- OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
- Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
- AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
మంగళవారమే దెబ్బతిన్న చెన్నై, బెంగళూరు సర్వీసులు
తుఫాన్ ముసరుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (అక్టోబర్ 27) నాడే చెన్నై, బెంగళూరు సర్వీసులు సైతం దెబ్బతిన్నాయి. చెన్నై నుంచి విజయవాడకు వచ్చి తిరిగి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 7305/7302), అలాగే బెంగళూరు నుంచి విజయవాడ రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమానం (6E 7247/7246) రద్దయ్యాయి. వీటితో పాటు కడప–విజయవాడ (6E 7711/7712), హైదరాబాద్–విజయవాడ (6E 2780/2581) ఇండిగో సర్వీసులు, విశాఖపట్నం–విజయవాడ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (IX 2413/2414) విమానాలు కూడా రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
తీరం దాటనున్న ‘అర్నబ్’.. ప్రయాణికులకు హెచ్చరిక
వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం.. ఈ ‘అర్నబ్’ తుఫాన్ మరింత బలపడి బాపట్ల – విశాఖపట్నం (యానం) మధ్య అక్టోబర్ 28 ఉదయం సమయంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో (కొన్నిసార్లు 140 కిమీ వరకు) తీవ్రమైన ఈదురుగాలులు వీయడంతో పాటు కోస్తాంధ్ర ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు ఎవరైనా విజయవాడ విమానాశ్రయం ద్వారా ప్రయాణం పెట్టుకుని ఉంటే, ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందే సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించి ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Flights Cancelled : తుఫాన్ దెబ్బ.. విజయవాడలో ఇండిగో విమానాలన్నీ రద్దు.!
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!