Minister Nara Lokesh:ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తినబాట పట్టారు.. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. కొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. అమరావతి చట్టబద్ధతకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీకానున్నారు.. విద్య, ఐటీ సంబంధిత అంశాలపై చర్చిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. ఇవాళ ఢిల్లీలోనే ఉండి.. రేపు అక్కడి నుంచి నేరుగా విశాఖకు రానున్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో GMR ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభంలో పాల్గొనున్నారు.
Read Also: AI Videos: ఏఐ సహాయంతో మహిళ అశ్లీల ఫోటోల సృష్టి.. ఆపై బ్లాక్‌మెయిల్.. చివరకు..?
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు మార్లు ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ.. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం.. నిధులు రాబట్టడం కోసం ప్రయత్నాలు చేస్తోన్న విషయం విదితమే..