Off The Record: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టుగా జరిగాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం భీష్మించుకు కూర్చుని వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టడంతో కూటమి సభ్యులు కొందరు ఆ పాత్ర పోషించారు. మొదట్లో బాగానే ఉన్నా.. రానురాను అదే... ప్రభుత్వానికి, ప్రత్యేకించి టీడీపీకి తలనొప్పిగా మారిందన్న అభిప్రాయం బలంగా ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో.