AP Inter Results 2026: ఇవాళే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాలు విడుదల కావాల్సిన సమయం రానేవచ్చింది.. రాష్ట్రంలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలను ఈరోజు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో సులభంగా చూసుకోవచ్చు. ఫలితాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారిక వెబ్సైట్ resultsbie.ap.gov.in ను సందర్శించి హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే వెంటనే మార్కులు, గ్రేడ్లు తెలుసుకోవచ్చు.
Read Also: Anna Canteen: ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు.. నేడు ప్రారంభించనున్న సీఎం
Also Read
- Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
అలాగే, విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. మన మిత్ర సేవ ద్వారా 95523 00009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే వెంటనే ఇంటర్ ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో వెబ్సైట్లో ట్రాఫిక్ ఎక్కువైనా విద్యార్థులు సులభంగా రిజల్ట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు మంత్రి నారా లోకేష్.. అయితే, ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను దాదాపు 10.50 లక్షల మంది రాశారు.. దీంతో.. విద్యార్థులతో పాటు.. వారి పేరెంట్స్ కూడా ఆతృతగా ఇంటర్ ఫలితాల కోసం వేచిచూస్తున్నారు..
మంత్రి నారా లోకేష్ మంగళవారం రోజు చేసిన ట్వీట్..
The wait ends tomorrow!
Intermediate Public Examinations (IPE) 2026 results for 1st & 2nd year students will be out on April 15 from 10:31 AM onwards.
Check instantly at https://t.co/UDtk11c781 or skip the queues – just send a “Hi” to Mana Mitra on📱WhatsApp (9552300009) and…
— Lokesh Nara (@naralokesh) April 14, 2026
తాజావార్తలు
-
100% Ethanol: 100% ఇథనాల్‌పై ప్రభుత్వ కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
-
Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
-
Sing Geetham : ‘సింగ్ గీతం’ హీరో అయాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా ?
-
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ సోదరి ఎమోషనల్ పోస్ట్.. రాముడి రూపంలో సోదరుడి చిత్రాన్ని పంచుకుంటూ నివాళి
-
Gautam Gambhir: అబ్బబ్బా ఏం షాట్ అది.. బిత్తరపోయిన గౌతమ్ గంభీర్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!