Vangalapudi Anitha: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడో మరోసారి తెరపైకి వచ్చింది.. ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై విచారణ చేస్తామన్న ఆమె.. సాక్షుల వరుస మరణాల అంశంపై కేబినెట్లో చర్చించాం సమగ్ర దర్యాప్తు జరపాలని అదేశించాం అన్నారు.. ఈ కేసులో ప్రధాని సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతి డైవర్షన్ అనాలో లేదా కొసమెరుపు అనాలో అర్థం కావడం లేదన్నారు.. రంగన్న మరణంపై పోస్ట్ మార్టం తరువాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. వివేక హత్య కేసులో ఎవరి మరణాలు అయినా మిస్టరీగా మాత్రం మిగలవు. వివేక హత్య కేసులో ఎవ్వరూ తప్పు చేసిన శిక్ష తప్పదు. కొంగ జపాలు చేసిన తలకిందులుగా తపస్సు చేసినా.. తప్పు చేసిన వారికి శిక్ష మాత్రం తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు హోం మంత్రి వంగలపూడి అనిత..
Read Also: Hyderabad: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం.. క్లాత్ షోరూంలో ఎగసిపడ్డ మంటలు
కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి, వాచ్మెన్ రంగన్న మృతిపై కూడా ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. వివేకా హత్య కేసులో సాక్షులు, నిందితులుగా ఉన్నవారిలో నలుగురు చనిపోవడంపై మంత్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. పరిటాల రవి హత్య కేసులో కూడా సాక్ష్యులు ఇలానే చనిపోయారని సీఎం చంద్రబాబుకు చెప్పారు. రంగన్న మృతి అనుమానాస్పదంగా ఉందని సీఎం చంద్రబాబు కూడా అభిప్రాయపడ్డారు. దీనిపై డీజీపీ హరికుమార్ గుప్తాను వివరణ కోరగా… ఆ మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. దీంతో.. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది కేబినెట్.