AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్ చేసిన నగల విడుదలకు బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు నిలిపివేసింది.ఇప్పటివరకు Andhra Pradesh Anti-Corruption Bureau నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను నామమాత్రపు పూచికత్తుతో విడుదల చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను ఏసీబీ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు.
Read Also: CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ
Also Read
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
- AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో స్వాధీనం చేసుకున్న ఆభరణాలను విడుదల చేయడం సరికాదని స్పష్టం చేసింది. ఒకవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు జరుగుతుండగా, మరోవైపు నామమాత్రపు పూచికత్తుతో ఆభరణాలు విడుదల చేయడం దర్యాప్తుకు విఘాతం కలిగించే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏసీబీ తరఫు న్యాయవాది శ్యామలరావు వాదనలు వినిపిస్తూ, అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను సులభంగా విడుదల చేయడం వల్ల దర్యాప్తు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. భవిష్యత్తులో సంబంధిత ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు తేలితే, వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రభుత్వం పరం అయ్యే అవకాశం ఉంటుందని కూడా వివరించారు.
అలాగే, కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఆభరణాలు అత్యవసరంగా అవసరమైతే, వాటి విలువకు సమానమైన బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుందని ఏసీబీ తరఫు న్యాయవాది కోర్టుకు సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి, విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అవినీతి కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!