Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simhachalam Temple Land: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను ప్రైవేటు సంస్థకు బదిలీ చేసిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దేవస్థానం భూముల బదిలీకి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా అడవివరం గ్రామంలోని సర్వే నంబర్ 275, ముదసర్లోవ గ్రామంలోని సర్వే నంబర్ 26 పరిధిలో ఉన్న మొత్తం 160 ఎకరాల దేవాదాయ భూమిని వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్‌కు బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
అయితే, ఈ పిల్‌ను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూమిని ప్రైవేటు సంస్థకు బదిలీ చేయడానికి గల కారణాలు, అనుసరించిన విధివిధానాలపై పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ సభ్య కార్యదర్శి, రాష్ట్రస్థాయి నిపుణుల అంచనా కమిటీ చైర్మన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (APIIC) మేనేజింగ్ డైరెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అలాగే వైజాగ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సంబంధిత ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!