సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. గత ఏడాది వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. రెండు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా.
సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు వివాదం ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా అనువంశిక ధర్మకర్త, చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఆహ్వానితులుగా అధికారపార్టీకి అనుకూలమైన వ్యక్తులు నామినేట్ అయ్యారు. పాలకమండలి కూర్పు ప్రభుత్వ నిర్ణయాధికారమే అయినప్పటికీ.. అది కొలువుతీరిన తీరు చర్చగా మారింది. చైర్మన్‌గా అశోక్ గజపతిరాజుకు ఆహ్వానం లేకుండానే అధికారులు కథ నడిపించేశారు. ఈ అంశాన్ని అశోక్ సీరియస్‌గా తీసుకుని న్యాయ సలహా కోరడంతో…