Site icon NTV Telugu

Jogi Ramesh: జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట

Ap High Court

Ap High Court

Jogi Ramesh: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట దక్కింది.. ఆయనపై నమోదు చేసిన కేసుల్లో ఎలాంటి కఠిన చర్యలు.. ఏవీ తీసుకోవద్దని ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.. ఇక, జోగి రమేష్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. విచారణ సందర్భంగా జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి.. జోగి రమేష్ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్రం, భావవ్యక్తీకరణలో భాగమని పేర్కొంది హైకోర్టు.. ఆయనపై ఆరోపించిన నేరాలు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవే.. అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది.. మొత్తంగా జోగి రమేష్ పిటిషన్‌లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు..

Read Also: YS Jagan: ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? తగలబెడతారా..?

Exit mobile version