NTV Telugu Site icon

Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్‌..

Secretariat Employees

Secretariat Employees

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరేషన్‌పై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను ఇచ్చింది.. ఈ అంశానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతోంది… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకు వెళ్లారు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. ఈ రోజు మంత్రి డోలతో సమావేశమైన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.. డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగులు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్‌లో ఉన్నారని.. జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇవ్వాలన్నారు.. ఉద్యోగుల అనుభవం అర్హతలు బట్టి ఆయా శాఖల్లో నియమించాలన్నారు.. జాబ్ చార్ట్ తయారు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు ఉద్యోగులు..

Read Also: Murder : మేడ్చల్‌లో వరుస హత్యలు.. 24 గంటలలోపే మరో మర్డర్‌..

ఇక, మల్టీ పర్పస్ అసిస్టెంట్ల.. ఆస్పిరేషనల్ అసిస్టెంట్లు అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను విభజించారని ఏ బాధ్యత అప్పగిస్తారో చెప్పాలన్నారు.. మహిళా పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని.. వారి సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు ఉద్యోగులు.. తమ ఉద్యోగాలు.. కొన్ని నాలుగు శాఖలతో సమన్వయం కలిగి ఉన్నాయని.. కనీసం ఒక రోజు సెలవు కావాలంటే నలుగురు అధికారులను కలవాల్సి ఉందన్నారు.. ఇదో పెద్ద సమస్యగా మారిందన్నారు ఉద్యోగులు.. దివ్యాంగులైన ఉద్యోగులను ఫీల్డ్ కు వెళ్లే బాద్యత తొలగించాలని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.. అయితే, ఉద్యోగుల సమస్యలు అన్ని వివరంగా విన్నామన్నారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. ఈ నివేదిక ఆధారంగా రేషనలైజెషన్ పై నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి డోల బాల వీరాo జనేయ స్వామి. అధికారుల కమిటీ త్వరలోనే అన్ని విషయాలు చర్చించనుంది.. ఆ తర్వాత. రేషనైలేజేషన్ పై స్పష్టత రానుంది.. అసెంబ్లీలో ప్రభుత్వం ఇదే అంశం లో ప్రకటన చేసే అవకాశం ఉంది…

Read Also: Maruti Shift : మారుతి షిఫ్ట్ కారు కొనాలని చూస్తున్నారా.. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి..ఈఎంఐ పూర్తి వివరాలు ఇవే !

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో రేషనలైజెషన్ పై చర్చలు జరిపాం.. 35 ఉద్యోగ సంఘ నేతలు హాజరు అయ్యారని తెలిపారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను.. పీఆర్సీ లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో పెట్టమని కొందరు కోరారు.. శాఖలో మార్పు చెయ్యాలని తెలిపారు.. సాధ్యాసాధ్యాలపై ఆలోచించి ముందుకు వెళ్తాం.. వీలు అయినంత త్వరలో శాఖల కేటాయింపు జరుగుతుంది. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే పరిస్థితి లేదు.. త్వరలో అధికారులు తో కమిటీ ఏర్పాటు చేస్తాం. పని భారం పెరిగే అవకాశం ఉన్న ఉద్యోగుల విషయంలో కూడా స్వేచ్ఛ ఉంటుంది.. శాఖల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.