Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్..
- గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..
- ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే పరిస్థితి లేదన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరేషన్పై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను ఇచ్చింది.. ఈ అంశానికి సంబంధించి కసరత్తు కూడా జరుగుతోంది… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకు వెళ్లారు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. ఈ రోజు మంత్రి డోలతో సమావేశమైన ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నేతలు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.. డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగులు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్నారని.. జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇవ్వాలన్నారు.. ఉద్యోగుల అనుభవం అర్హతలు బట్టి ఆయా శాఖల్లో నియమించాలన్నారు.. జాబ్ చార్ట్ తయారు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు ఉద్యోగులు..
Read Also: Murder : మేడ్చల్‌లో వరుస హత్యలు.. 24 గంటలలోపే మరో మర్డర్..
Also Read
- AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
ఇక, మల్టీ పర్పస్ అసిస్టెంట్ల.. ఆస్పిరేషనల్ అసిస్టెంట్లు అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను విభజించారని ఏ బాధ్యత అప్పగిస్తారో చెప్పాలన్నారు.. మహిళా పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారని.. వారి సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు ఉద్యోగులు.. తమ ఉద్యోగాలు.. కొన్ని నాలుగు శాఖలతో సమన్వయం కలిగి ఉన్నాయని.. కనీసం ఒక రోజు సెలవు కావాలంటే నలుగురు అధికారులను కలవాల్సి ఉందన్నారు.. ఇదో పెద్ద సమస్యగా మారిందన్నారు ఉద్యోగులు.. దివ్యాంగులైన ఉద్యోగులను ఫీల్డ్ కు వెళ్లే బాద్యత తొలగించాలని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.. అయితే, ఉద్యోగుల సమస్యలు అన్ని వివరంగా విన్నామన్నారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. ఈ నివేదిక ఆధారంగా రేషనలైజెషన్ పై నిర్ణయం ఉంటుందన్నారు మంత్రి డోల బాల వీరాo జనేయ స్వామి. అధికారుల కమిటీ త్వరలోనే అన్ని విషయాలు చర్చించనుంది.. ఆ తర్వాత. రేషనైలేజేషన్ పై స్పష్టత రానుంది.. అసెంబ్లీలో ప్రభుత్వం ఇదే అంశం లో ప్రకటన చేసే అవకాశం ఉంది…
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో రేషనలైజెషన్ పై చర్చలు జరిపాం.. 35 ఉద్యోగ సంఘ నేతలు హాజరు అయ్యారని తెలిపారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను.. పీఆర్సీ లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో పెట్టమని కొందరు కోరారు.. శాఖలో మార్పు చెయ్యాలని తెలిపారు.. సాధ్యాసాధ్యాలపై ఆలోచించి ముందుకు వెళ్తాం.. వీలు అయినంత త్వరలో శాఖల కేటాయింపు జరుగుతుంది. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే పరిస్థితి లేదు.. త్వరలో అధికారులు తో కమిటీ ఏర్పాటు చేస్తాం. పని భారం పెరిగే అవకాశం ఉన్న ఉద్యోగుల విషయంలో కూడా స్వేచ్ఛ ఉంటుంది.. శాఖల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!