NTV Telugu Site icon

AP Assembly sessions: రేపు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు..

Ap Assembly

Ap Assembly

AP Assembly sessions: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసింగించారు.. ఇక, రెండు రోజుల శాసన సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది కూటమి ప్రభుత్వం.. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు స్పీకర్‌.. ఆ తర్వాత కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టనుంది చంద్రబాబు సర్కార్‌.. ఇక, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ సాగనుంది.. ధన్యవాదాల తీర్మానంపై చర్చను కాల్వ శ్రీనివాసులు ప్రారంభించనున్నారు.. తీర్మానాన్ని బలపరచనున్నారు గౌతు శిరీష. ధన్యవాదాల తీర్మానంపై రిప్లై ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు.

Read Also: Mumbai: ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర నౌకలో మంటలు.. ఒకరు గల్లంతు

ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు మంత్రులు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల విషయానికి వస్తే.. పాఠశాలల్లో నాడు – నేడు, కొత్త పాలిటెక్నిక్-ఐటీఐలు, వలంటీర్ల వ్యవస్థ, వీఆర్ లో ఉన్న ఇన్స్ పెక్టర్ల సమస్యలు, 2022-గ్రూప్-1 పోస్టుల ఇంటర్వూలు… విశాఖ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఎస్సీ సబ్ ప్లాన్, కేంద్ర పథకాలు, విభజన హామీలు, తుంగభద్ర హెచ్ఎల్ కెనాల్ మోడ్రనైజేషన్ పై సమాధానాలు ఇవ్వనున్నారు రాష్ట్ర మంత్రులు..

Read Also: CM Revanth: రాహుల్ గాంధీతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..?

మరోవైపు.. రెండో రోజు శాసన మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చించనున్నారు.. ధన్యవాదాల తీర్మానంపై మండలిలో చర్చను ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రారంభించనుండగా.. తీర్మానాన్ని బలపరచనున్నారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ. మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు మంత్రులు. మండలిలో ప్రశ్నోత్తరాల విషయానికి వస్తే.. ఆర్థిక సంఘం గ్రాంట్ల మళ్లింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ పథకం, జాతీయ రహదారి పనుల్లో అవకతవకలు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, టీటీడీలో అక్రమాలు.. వైద్యారోగ్యం, పౌర సరఫరాల రుణాలు, ఫిషింగ్ హర్బర్లు, గనుల్లో అక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆరోగ్య శిబిరాలపై సమాధానాలు ఇవ్వనున్నారు.

Show comments