RBI: మీరు ఈఎంఐ పద్ధతిలో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనను పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఒక కస్టమర్ వాయిదాల పద్ధతిలో మొబైల్ కొనుగోలు చేసి, సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆయా బ్యాంకులు, రుణ సంస్థలు ఆ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేస్తాయి. ఈ నిర్ణయానికి ఆర్బీఐ తర్వలో అనుమతి ఇవ్వనుంది. వినియోగదారుల వాస్తవ ప్రయోజనాలను కాపాడుతూనే, బ్యాంకుల మొండి రుణాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఫోన్లతో సహా మూడింట ఒక వంతు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో చిన్న-టికెట్ వ్యక్తిగత రుణాలపై కొనుగోలు చేస్తున్నట్లు హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ 2024 అధ్యయనం చూపించింది.
READ MORE: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు హతం..
గతేడాది ఇలాగే బ్యాంకులు, రుణ సంస్థలు ఈఎంఐలు తిరిగి కట్టకపోతే మొబైల్ ఫోన్‌లను లాక్ చేయడానికి ప్రయత్నించాయి. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆర్బీఐ.. ఈ చర్యలను అడ్డుకుంది. అయితే ఇప్పుడు ఇలాంటి నిరర్థక రుణాలు పెరిగిపోతుండటంతో రికవరీ పెంచుకోవడంలో భాగంగా కస్టమర్ల ఫోన్‌లను లాక్ చేసేందుకు ఆర్బీఐ రుణ సంస్థలకు అనుమతి ఇచ్చే ఆస్కారం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొదటగా బ్యాంకులు, రుణసంస్థలతో ఆర్బీఐ సంప్రదింపులు జరపనుంది. అనంతరం ఫోన్-లాకింగ్ మెకానిజమ్‌పై మార్గదర్శకాలను ప్రవేశ పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ.. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఉంది. సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే తమ ఫోన్‌ను లాక్ చేస్తామని ముందుగానే కష్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది.
READ MORE: Dowry Harassment: పెళ్లయిన 4 నెలలకే.. వరకట్న దాహానికి నవ వధువు బలి..