AP Government: మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి సహా నలుగురు ఐఏఎస్‌లను రిలీవ్ చేసిన సర్కార్.. ఉత్తర్వులు జారీ
- మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి సహా.. నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేసిన ప్రభుత్వం..
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్..
- ఈ నెల 30వ తేదీన రిటైర్డ్ కానున్న నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి సహా.. నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేసింది.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే, ఈ నెల 30వ తేదీన నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు రిటైర్ కానున్నారు.. వారిలో జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య, వెంకట రమణా రెడ్డి, అరుణ్ కుమార్ ఉన్నారు.. దీంతో.. ఈ నెల 30వ తేదీన రిటైర్ కానున్న నలుగురు ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేస్తున్నట్టు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Also: Darshan: దర్శన్ కు మద్దతు పలికిన నటికి అభిమానుల టార్చర్.. చెప్పుకోలేనంత అసభ్యంగా!
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
కాగా, గత ప్రభుత్వంలో సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించి.. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డితో పాటు.. మరో సీనియర్ ఐఏఎస్ పూనమ్ మాలకొండయ్యకు ఈ రోజే పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డికి.. సాధారణ పరిపాలన శాఖలో జీపీఏం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనమ్ మాలకొండయ్యకి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం విదితమే.. ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న ఇద్దరు సీనియర్ అధికారులకు మూడు రోజుల ముందే పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.. మరోవైపు ఈ రోజే వారిని రిలీవ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!