AP Government: రైతు సమస్యలపై ఏపీ సర్కార్ ఫోకస్.. కీలక నిర్ణయం
- రైతు సమస్యలపై ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్..
- పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లపై కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: రైతు సమస్యలపై ఫోకస్ పెంచింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. తాజాగా పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పొగాకు రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎఫ్‌సీవీ రకాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనేది టొబాకో బోర్డు నిర్ణయించాలన్నారు సీఎం చంద్రబాబు. వైట్ బర్లీ పొగాకు రకాన్ని ఒప్పందం మేరకే సాగు చేయించి కంపెనీలే కొనుగోలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Read Also: MLA Peddireddy Dwarakanath Reddy: ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై కేసు నమోదు..
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు మార్కెట్ యార్డులను పొగాకు కొనుగోళ్ల కోసం ఇప్పటికే సిద్ధం చేశారు. అన్ని రకాల పొగాకును కొనుగోలు చేసే విధంగా కంపెనీలతో అధికారులు సంప్రదింపులు జరపనున్నారు.. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయశాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.. మరోవైపు 43 వేల మెట్రిక్ టన్నుల మ్యాంగో పల్ప్ నిల్వలు ప్రాసెసింగ్ కంపెనీల దగ్గర నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులు కేజీ మామిడి 12 రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యాపారులు కనీసం 8 రూపాయలు చెల్లిస్తే.. ప్రభుత్వం 4 రూపాయలు నేరుగా రైతులకే చెల్లించనుంది. అలాగే కోకో పంటకు కనీసం 500 రూపాయలు గిట్టిబాటు కల్పించేలా చూడాలని నిర్ణయించారు. తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు కొంతవరకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!