Pawan Kalyan Suffering With Viral Fever: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. జ్వరంతోనే బెజవాడలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష
- వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- ఫీవర్.. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న పవన్..
- అస్వస్థతతో ఉన్నప్పటికీ పంచాయతీరాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం..
- వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Suffering With Viral Fever: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు.. ఫీవర్ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అయితే, అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు పవన్ కల్యాణ్.. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోతే అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.. దోమల బెడద తీవ్రత ఉన్నందున.. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు.. మరోవైపు.. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైద్యుల సూచనలు తీసుకొంటున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు సైతం వైరల్ ఫీవర్‌తో ఇబ్బందిపడుతున్నట్టుగా తెలుస్తోంది..
Read Also: Duleep Trophy: అన్న విఫలం.. తమ్ముడు శతకం
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్‌లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
మరోవైపు.. బుడమేరు సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తిన తరుణంలో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడా? అంటూ వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్న తరుణంలో ఆయన ఘాటుగానే బదులిచ్చిన విషయం విదితమే.. నేను బయటకి రావడం లేదని వైసీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారన్న పవన్.. ఈ విషయంపై నేను ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను.. నేను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతందని అధికారులు చెప్పారు.. వారి సూచనతో నేను వెనక్కి తగ్గానని క్లారిటీ ఇచ్చారు.. అలాఅని నేను ఏమీ చేయడం లేదని అనడం సరికాదన్నర ఆయన.. తాను వరదలపై సమీక్షలు చూస్తూనే ఉన్నానని వివరించారు.. ఇక, పవన్ కల్యాణ్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించే వైసీపీ నేతలు నాతో ఒక్కసారి వచ్చి చూడండి.. నేను ఏం చేస్తున్నానో మీకే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.. అంతేకాదు.. నేను బయటకు వెళ్తే ఎలా ఉంటుందో.. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలుసుకోవాలంటే.. నాతో పాటు రండి అంటూ పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు సలహా ఇచ్చిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!