CM Chandrababu: తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పందించిన ఏపీ సీఎం..
- తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పేరు ప్రస్తావన..
- కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో గుర్తుచేసుకున్న ఏపీ సీఎం..
- 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తు చెయ్యడం సంతోషం..
- ఏ ఇజం లేదు టూరిజం ఒక్కటే అని తాను మాట్లాడితే విమర్శలు చేశారు..
- టూరిజంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తాను చెప్పిన మాటలను 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తు చెయ్యడం సంతోషం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గతంలో ఏ ఇజం లేదు టూరిజం ఒక్కటే అని తాను మాట్లాడితే తీవ్ర విమర్శలు చేశారన్నారు.. కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్నే ప్రస్తావించారు సీఎం.. టూరిజంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు..
Read Also: Jr. NTR : నందమూరి తారక ‘రాముడు’ తో ఉన్న ‘లక్ష్మణుడు’ ఎవరంటే.?
Also Read
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కలెక్టర్ల సదస్సులో రెండో రోజు చర్చ జరిగింది.. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సభలో ప్రస్తావించారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు.. ఉన్నదంతా టూరిజమే అని నాడు చంద్రబాబు అనేవారు అంటూ చెప్పుకొచ్చారు కూనంనేని.. చంద్రబాబు నాడు ఇజంపై చెప్పిన మాటే నిజం అంటూ తెలంగాణ సభలో అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే కూనంనేని.. అయితే, పత్రికలో వచ్చిన ఆ వార్తను కలెక్టర్ల సదస్సుల్లో టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. ఏ ఇజం లేదు అని నేను నాడు అంటే కమ్యునిస్టులు నాపై విరుచుకుపడ్డారు.. నాపై విమర్శలు చేశారు.. ఇప్పుడు తెలంగాణలో శాసన సభ్యుడు మాట్లాడతూ ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ నేడు స్టేట్మెంట్ ఇచ్చారు అని గుర్తుచేశారు.. తాను చెప్పిన మాటలను, తన ఆలోచనలను అర్ధం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు..
Read Also: MA 2 : అసిస్టెంట్ డైరెక్టర్ కు నయన్ మధ్య గొడవ.. సినిమా క్యాన్సిల్..?
అయితే, ఇప్పుడు అంత సమయం లేదని.. త్వరగా ప్రాజెక్టులు తెచ్చి.. ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ఇటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్దికి అనేక అవకాశాలు ఉన్నాయన్న చంద్రబాబు.. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ది ప్రాజెక్టులపై శ్రద్ద పెట్టాలని సూచించారు.. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. ఎకనమీ పెరిగి.. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్నారు.. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి కల్పించే రంగం టూరిజం అని వ్యాఖ్యానించారు.. ప్రతి జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని వాటికి అనుగుణంగా పనిచేస్తే టూరిజం పెద్ద ఉపాధి మార్గం అవుతుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!