AP Cabinet Meeting: మంత్రివర్గ సమావేశం.. పవన్ కల్యాణ్ సహా ముగ్గురు మంత్రులు డుమ్మా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మూడున్నర గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో.. 50కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. ఎస్ఐపీబీ, సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు..
అయితే, ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇద్దరు మంత్రులు.. అంటే పవన్ కల్యాణ్ సహా ముగ్గురు మంత్రులు డుమ్మా కొట్టారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పవన్ కల్యాణ్.. స్వల్ప అనారోగ్యం కారణంగా కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండగా.. రేపు సీఎం చంద్రబాబు నాయుడు వెలిగొండ పర్యటన ఉండడంతో.. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న మంత్రి గొట్టిపాటి రవి కూడా కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు.. ఇక, కేరళ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా మంత్రి వర్గ సమావేశానికి రాలేక పోయారు.. ఇలా మొత్తంగా ఈ రోజు కేబినెట్ సమావేశానికి ముగ్గురు మంత్రులు దూరంగా ఉన్నారు..
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇక, పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది.. రాజమండ్రి, చీరాల, సత్యసాయి జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది కేబినెట్.. సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.. ఉన్నతవిద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్ సమావేశం.
తాజావార్తలు
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!