Post Office RD: ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ మంచి వడ్డీ లభించే ప్రదేశంలో సొమ్మును పెట్టుబడి పెట్టాలని కోరుకుంటాడు. అలంటి వారికీ పోస్టాఫీస్ నిర్వహిస్తున్న పథకాలు మంచి ఎంపికగా నిలుస్తాయి. వీటిలో ఒకటి పోస్టాఫీస్ ఆర్‌డి (Recurring Deposit) స్కీమ్. ఈ పథకం 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. రోజుకు కేవలం రూ.100 పొదుపు చేయడం ద్వారా 5 ఏళ్లలో లక్షల రూపాయలను సంపాదించవచ్చు.
Read Also: IPL 2025: ఐపీఎల్‌లో అమ్ముడుపోని శార్దూల్ ఠాకూర్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఈ జట్టులోకి..!
ప్రతి ఒక్కరూ తమ కష్టం మీద సంపాదించిన డబ్బును భద్రమైన, లాభదాయకమైన ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ అలాంటి గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. చిన్న మొత్తాలతో పద్దతిగా పొదుపు చేస్తూ పెద్ద మొత్తాన్ని తయారు చేసుకోవాలనుకునే వారికి ఈ పథకం వరంగా చెప్పుకోవచ్చు. ముందుగా ఈ పథకంలో ఖాతా ప్రారంభించాలంటే ఏదైనా దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళ్లి ఖాతా తెరవవచ్చు. ఈ పథకంలో కనీసం 100 పెట్టుబడి పెట్టి ప్రారంభించవచ్చు. అయితే, గరిష్ట పెట్టుబడికి ఎటువంటి పరిమితి లేదు. ఈ పథకంలో మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు.
పోస్టాఫీస్ ఆర్‌డి స్కీమ్ ద్వారా, రోజుకు కేవలం 100 పొదుపు చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తాన్ని అందుకోవచ్చు. రోజుకు 100 పొదుపు చేస్తే నెలకు 3,000 అవుతుంది. ఇలా సంవత్సరానికి మొత్తం రూ.36,000 అవుతుంది. 5 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ .1,80,000 గా అవుతుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6.7% వడ్డీ అందుబాటులో ఉంది. అంటే 5 సంవత్సరాలకు మొత్తం వడ్డీ ₹34,097 వస్తుంది. దీంతో మొత్తం గడువు ముగిసే సరికి మీ ఖాతాలో రూ .2,14,097 ఉంటుంది.
Read Also: Ranya Rao: నవంబర్‌లో వివాహం, డిసెంబర్‌లో విడిపోయాం.. కోర్టులో చెప్పిన రన్యా రావు భర్త
ఈ ఖాతా ప్రపంచంలో ఎవరికైనా, చిన్న పిల్లల పేరు మీద కూడా ప్రారంభించవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల పేరు మీద ఖాతా ప్రారంభించేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. అత్యవసర పరిస్థితుల్లో మెచ్యూరిటీ కాకముందే ఖాతాను మూసివేసే అవకాశం కూడా ఉంది. ఈ స్కీమ్‌లో ఋణ సదుపాయం కూడా లభిస్తుంది. అంటే, అవసరమైతే మీరు ఖాతాలోని డిపాజిట్‌పై అప్పు తీసుకోవచ్చు.