Schools Bandh: విద్యార్థులకు అలర్ట్.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల బంద్కు పిలుపునిచింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్.. మన వేదన అందరికీ తెలియచేసే కార్యక్రమానికి అందరి సహకారంతో కార్పొరేట్ స్కూళ్లలో సహా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. ఈ రోజున జరిగిన జూమ్ సమావేశంలో తెలియచేసిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు మన సభ్యులందరూ వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు.. రేపు అనగా 3-07-2025 గురువారం నాడు స్కూళ్లను మూసివేయడం ద్వారా – మన ఆవేదన, సమస్యలను తెలియజేయడానికే.. కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్.. ఈ కార్యక్రమాన్ని మన సమిష్టి ఐక్యతను అందరి దృష్టికి తీసుకెళ్లే చిరు ప్రయత్నం… రేపటి బంద్కు విద్యార్థులు, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సహకరించాలని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ , APPUSMA, ISMA, UPEIF, UPSF తదితరులు.
Read Also: Workplace Harassment: టాయిలెట్లో మహిళా ఉద్యోగిని వీడియో తీసిన ఇన్ఫోసిస్ ఉద్యోగి..