NTV Telugu Site icon

AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మళ్లీ సర్కార్‌ ఫోకస్‌.. ఈ సారి ఆ పోస్టులు భర్తీ..!

Pawan Babu

Pawan Babu

AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. ఇక, మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈసారి, ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవులు భర్తీ చేయనున్నారు.. రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్.. డైరెక్టర్ల పదవులపై కసరత్తు చేస్తున్నారు.. దేవాలయాల పాలక మండళ్లపై కూడా దృష్టిసారించింది ప్రభుత్వం. ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటుపై.. జిల్లా నియోజకవర్గ స్థాయిలో పదవుల భర్తీపై దృష్టి పెట్టారు..

Read Also: Indiramma Atmiya Bharosa: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో పిల్!

దీనికి సంబంధించిన పేర్లు పంపించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయట.. మరోవైపు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయానికి కొందరి లిస్ట్ చేరిపోయింది.. ఇవాళ రెపట్లో మరికొందరి జాబితా టీడీపీ హెడ్‌ ఆఫీస్‌కు చేరనున్నాయి.. కూటమిలో టీడీపీకి 80 శాతం.. జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం లెక్కన పదవులు కేటాయించే విధంగా కసరత్తు చేస్తున్నారు.. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది.. మరోవైపు.. జనసేన, బీజేపీ ప్రతిపాదనలు కూడా తీసుకుని.. పాలక మండళ్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్ల ఎంపిక తర్వాత జీవోలు విడుదల చేయనుంది కూటమి ప్రభుత్వం..