కన్నడ స్టార్ యాక్టర్ రాజ్ బి శెట్టి నటిస్తూ నిర్మించిన Su from SO. సో కన్నడ నాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాలుగున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా ఇప్పటివరకు 40 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి తమిళ రీమేక్ హక్కులు అమ్ముడయ్యాయి. తెలుగులో సినిమాని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పోటీలో ఈ సినిమా బాగా నడుస్తుందని భావించిన ఓటీటీ సంస్థలు తెలుగు ఓటీటీ రైట్స్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
ALso Read:Arabia Kadali Review: అరేబియా కడలి రివ్యూ
అయితే రాజ్ బి శెట్టి అండ్ టీం తెలుగు డిజిటల్ ప్లస్ సాటిలైట్ రైట్స్ 9 కోట్లకు చేస్తున్నట్లుగా సమాచారం. నిజానికి ఈ సినిమా బడ్జెట్ 4.5 కోట్లు కానీ, తెలుగు సాటిలైట్ డిజిటల్ రైట్స్ నుంచి 9 కోట్లు రాబట్టాలని చూడడం చూస్తుంటే, పెట్టిన బడ్జెట్‌కి డబుల్ తెలుగు డిజిటల్ నుంచే రావడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే G5 సంస్థ ఈ సినిమాకి 6 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. అయితే 9 కోట్లకు తగ్గమని ప్రస్తుతానికి టీం చెబుతున్నారు. ఈ సినిమాలో జేపీ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. ఇక శనిల్ గౌతమ్ సహా ఇతర నటీనటులు కీలక పాత్రలలో నటించారు.