AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి ఆమోదం..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ..
- పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం..
- పలు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పలు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్.. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.. ఇక, సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదాని పవర్ కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు భూ కేటాయించింది.. కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ పవర్ కు భూ కేటాయించగా.. ఎకరా 5 లక్షల రూపాయల చొప్పున భూ కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది కేబినెట్..
Read Also: AP High Court: వల్లభనేని వంశీ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా..
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
ఇక, 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి ర్యాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఏపీలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ అనుమతి ఇచ్చింది కేబినెట్.. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఎండీయూ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం.. ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ సాగింది.. మరోవైపు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీసైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీవోఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఏపీ లెదర్ ఫుట్ వేర్ పాలసీ 4.0కి.. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు.. రూ.30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్..
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!