Ambati Rambabu: అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కి ఏడు బిల్డింగ్‌లైనా పూర్తి చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అమరావతి ప్రాజెక్ట్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, 2029 నాటికీ రాజధాని పూర్తవుతుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంచుతున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం సాధ్యం కాదని ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 2029 నాటికీ కనీసం ఏడు భవనాలైనా పూర్తి చేస్తారో లేదో అనుమానం ఉందని అన్నారు.
Read Also: Iron Rich Foods: బాబోయ్ బ్లడ్ తగ్గిందా?.. ఇవి తింటే సరిపడా రక్తం పడుతుంది!
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
మావిగన్ అనే కొత్త అభివృద్ధి ఆలోచనను కూడా అంబటి ప్రస్తావించారు. ఇది జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ప్రతిపాదనగా పేర్కొంటూ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్‌గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదంతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం సుమారు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ మావిగన్ ప్రాజెక్ట్‌ను కేవలం 20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని అంబటి పేర్కొన్నారు. మూడు జిల్లాలతో కూడిన ఈ కారిడార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వృద్ధి కేంద్రంగా మారుతుందని చెప్పారు.
అలాగే అమరావతి రైతుల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు అంబటి. తమకు హామీ ఇచ్చిన ప్లాట్లు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీఆర్డీఏ అధికారులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత లేకపోవడం వల్లే ఈ అయోమయం నెలకొంది అని అంబటి ఆరోపించారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారడం సహజమేనని, అవసరమైతే కొత్త తీర్మానాలు ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు. మొత్తంగా, అమరావతి ప్రాజెక్ట్ భవిష్యత్తుపై మరోసారి రాజకీయ వాదనలు వేడెక్కుతున్నాయి. 2029 నాటికి రాజధాని పూర్తి అవుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!